మెదడు కంప్యూటర్ ఒక్కటే..

మనమెదడు ఎలా పనిచేస్తుంది.. అనే విషయంపై ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి. అయితే ఇంతవరకు పూర్తిస్థాయిలో మాత్రం పరిశోధనలు సాగలేదు. మనం ఏదైనా డాటాను డిజిటల్ రూపంలో కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తాం.. అలాగే మెదడులోనూ ఓ వ్యవస్థ ఉంటుంది. మన జ్ఞాపకాలను మనం చూసిన వస్తువులను మనుషులను పేర్లను స్టోర్ చేసుకోవడానికి అచ్చం కంప్యూటర్లాగే మెదడులోనూ ఓ వ్యవస్థ ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. కెంట్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఇందుకు సంబంధంచి పరిశోధనలు చేసి ఓ కీలక విషయాన్ని కనిపెట్టారు.