మీ ప్రశ్నలకు మా సమాధానాలివే!

మా ఈ సూచనలు పాటించండి.. సురక్షిత ప్రయాణం సాగించండి.. అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బోధిస్తున్నారు. మీకు వచ్చే 9 ప్రశ్నలకు మా సమాధానాలను తప్పక చూడండి. మీ కుటుంబాల్లో సంతోషాన్ని నింపండి అని కోరుతున్నారు.

మనలో చాలా మంది చేసే చిన్నపాటి పొరపాట్లు చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు 9 ప్రశ్నలకు 9 సమాధానాలిస్తూ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా మీ కోసం ఆ సమాధానాలు తప్పక చూసి జాగ్రత్తలు తెలుసుకోండి. ఆ ప్రశ్నలు, సమాధానాలివే..

ప్రశ్న : చిన్న దూరపు ప్రయాణంలో కూడా హెల్మెంట్ అవసరమా?
జవాబు : దూరపు ప్రయాణం చేసేవారు ముందు జాగ్రత్తగా హెల్మెంట్ పెట్టుకుంటారు. కావున చాలా ప్రమాదాలు 25 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికే జరుగుతాయి.
ప్రశ్న : హెల్మెంట్ పెట్టుకుంటే జుట్టు పాడవుతుంది.
జవాబు : జుట్టు పాడయితే సరిచేసుకోవచ్చు. కానీ తల పోతే తెచ్చుకోలేము.
ప్రశ్న : తక్కువ స్పీడ్ లో నడిపే వారికి హెల్మెంట్ అవసరమా?
జవాబు : కానీ, ఎదురుగా వచ్చే వాహనం వేగంగా వచ్చి ప్రమాదం కలిగిస్తే?
ప్రశ్న : వెనుక కూర్చున్న వారికి హెల్మెంట్ అవసరమా?
జవాబు : ప్రమాదం జరిగినప్పుడు వెనుక కూర్చున్న వారికి మినహాయింపు ఉండదు కదా.
ప్రశ్న : హెల్మెంట్ పెట్టుకుంటే ఈ స్టైలిష్ బైక్ నడుపుతుంది.. నేనే అని ఎవరు గుర్తిస్తారు?
జవాబు : గుర్తింపు ముఖ్యమా.. తల ముఖ్యమా?
ప్రశ్న : నేను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాను. కనుక అవసరం లేదు.
జవాబు : కానీ నీకు ఎదురుగా వచ్చే వాహన డ్రైవర్ జాగ్రత్తగా డ్రైవ్ చేయకపోతే?
ప్రశ్న : త్వరగా వెళ్లాలి. హెల్మెంట్ పెట్టుకోవడానికి సమయం లేదు.
జవాబు : అవునా? రేపు హాస్పిటల్ లో జీవితాంతం ఉండాల్సి వస్తే?
ప్రశ్న : హెల్మెంట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది.
జవాబు : ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్ లో చేసే ఆపరేషన్స్ కన్నా పెద్ద ఇబ్బంది ఏమీ కాదు.
ప్రశ్న : 10ఏళ్లుగా బైక్ నడుపుతున్నా ఎప్పుడు కూడా గీసుకోలేదు. నాకెందుకు హెల్మెంట్
జవాబు : ఈ రోజు ఉన్నంత అదృష్టం రేపు ఉండదు కదా!