హ్యాపీ అనసూయ

బుల్లి, వెండితెర నటి అనసూయ అభిమానులతో ఆనందం పంచుకుంది. మీరు చూపిన అభిమానంతో మున్ముందు మరింతగా మిమ్మల్ని అలరిస్తానని అభిమానులకు భరోసా ఇచ్చింది. మీ ఆనందం తనకెంతో సంతోషాన్నిచ్చిందని చెప్పింది. ఇంతకూ సందర్భమేమిటంటారా.. ఈనెల 15న ఆమె పుట్టినరోజు.

అనసూయ పుట్టిన రోజు సందర్భంగా వివిధ సోషల్ మీడియా వేదికలపై అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దీంతో కృతజ్ఞతగా ఆమె ఇన్ స్టా వేదికగా 16న సోమవారం తన సంతోషాన్ని పంచుకుంది. వివిధ ఫొటోలను షేర్ చేసి తన ఆనందం వ్యక్తం చేసింది.

తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన అందరికీ అనసూయ థ్యాంక్స్ చెప్పింది. తనపై అభిమానులు చూపుతున్న ప్రేమను తానెంతో ఆస్వాదిస్తున్నానని చెప్పింది. మీ ఆనందం కోసం నేను మరింతగా అలరిస్తానని, మరిన్ని సినిమాల్లో నటిస్తానని చెప్పింది.