రూ.కోటిన్నర విలువైన బీరు బాటిళ్లు ధ్వంసం.. రోడ్డు రోలర్లతో తొక్కించిన అధికారులు

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : వంద కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్ష బీరు బాటిళ్లను అధికారులు ధ్వంసం చేశారు. కాలం చెల్లిన బీరు బాటిళ్లను గుర్తించి ఈ పని చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడిన వారయ్యారు. లేకుంటే ధనమే ప్రాణంగా వ్యాపారులు మార్కెట్ లో వాటిని వదిలితే ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉండేది.

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన భోపాల్ పరిధిలోని అబ్బాస్ నగర్ లోని ఓ గోడౌన్లో ఆరు నెలల గడువు ముగిసిన బీరు బాటిళ్లు నిల్వ ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ఆ గోడౌన్ లో లక్ష బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.5 కోట్ల విలువ ఉంటుందని అధికారులు నిర్ధారించారు. వాటిని రోడ్డుపై పరిచి రోడ్డు రోలర్లతో తొక్కించి ధ్వంసం చేశారు. అయితే కాలం చెల్లిన ఆ బీర్లను ఏమైనా అమ్మకాలు జరిపారా అంటూ అధికారులు విచారణ జరుపుతున్నారు.