మంత్రి కేటీఆర్ జన్మదినాన వితరణ

రచ్చబండ, కొడిమ్యాల : మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం టీఆర్ఎస్ పార్టీ నాయకులు వితరణ చాటుకున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో అకాల వర్షాలకు ఇల్లు కూలిన మహమ్మద్ షబ్బీర్ అలీ కుటుంబానికి 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నాచుపల్లి గ్రామంలో నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సింగిల్విండో చైర్మన్ మేనేని రాజనర్సింగరావు, సర్పంచుల పోరం అధ్యక్షుడు పునుగొంటి కృష్ణారావు, వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, ఆ పార్టీ అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లారెడ్డి, ఎంపీటీసీ సామల లక్ష్మణ్, కోఆప్షన్ సభ్యుడు నజీర్, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కోలాపురి రమేష్,

సర్పంచ్ అంబటి లతా తిరుమలేష్, పట్టణ అధ్యక్షుడు కొత్తూరు స్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నేరెళ్ల మహేష్, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ అంజన్ కుమార్, ఉపాధ్యక్షుడు పర్లపెల్లి ప్రభుదాస్, రొడ్డ శరత్, డైరెక్టర్లు దొంతరవేణి దేవయ్య, పర్లపల్లి ఆనందం, మహంకాళి గంగయ్య పాల్గొన్నారు.

ఇంకా టీఆర్ఎస్ పార్టీ నాయకులు బైరి వెంకటి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి శుక్రుద్దీన్, మీడియా సెల్ అధ్యక్షుడు గుండు రాజ్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు సిర్ర సుధాకర్, ఎస్సీ సెల్ గ్రామ శాఖ జల్గపు బాబు, గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు గుండు రమేష్, తదితరులు పాల్గొన్నారు.