శ్రీశైలానికి ఎంతమంది భక్తులు వచ్చారో తెలుసా?

రచ్చబండ : మహా వివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శనివారం శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తజనం పోటెత్తింది. ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు 8నుంచి 10 గంటల వరకు సమయం పడుతున్నది. దీంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పూజలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు సహా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో మహాక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఇదే రోజు

రాత్రి కల్యాణోత్సవం

ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంత్రం స్వామి, అమ్మవార్లు నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అర్ధరాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శివరాత్రి వేడుకల కోసం సుమారు 2 లక్షల మంది భక్తులు శ్రీశైలానికి వస్తారని అంచనా వేస్తున్నారు. సుమారు 1500 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.