కాంగ్రెస్ పార్టీలో కలవరం

కాంగ్రెస్ పార్టీలో కరోనా కలవరం పట్టుకుంది. తాజాగా ఆ పార్టీలో కొందరు అగ్రనేతలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అయినట్లు సమాచారం. వారిలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా నిర్ధారణ అయింది. ఆ పార్టీ మరో ముఖ్యనేత కేసీ వేణుగోపాల్‌కు కరోనా సోకినట్లు సమాచారం.

గతవారమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతల్లో కలవరం పట్టుకుంది. మరోవైపు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక అవినీతి కేసులో బుధవారమే సోనియా, రాహుల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 8న ఈడీ ముందు సోనియా విచారణకు హాజరు కావాల్సి ఉంది.

కరోనా అనుమానంతోనే తెలంగాణలో జరిగే చింతన్ శిబిర్ లో పాల్గొనాల్సిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ రాలేదని తెలిసింది. ప్రియాంకా గాంధీ కూడా ఈ శిబిరానికి రానున్నట్లు ప్రచారం జరిగింది. అయినా ఆమె కూడా రాలేకపోయారు.

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియాగాంధీ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నాయి. సత్వరమే ఆమె ప్రజాజీవితంలోకి రావాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.