అకాడమీలలో క్రీడాకారుల ఎంపికలు

= ఏఏ క్రీడల్లో అవకాశం.. అర్హతలేంటి?
= ఏఏ అకాడమీలలో ఖాళీలు
= ఎప్పటి వరకు చివరి గడువు

హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ క్రీడా అకాడమీలలో ప్రవేశాలకు క్రీడాకారుల ఎంపిక చేపడుతున్నారు. క్రీడల పట్ల ఆసక్తి గల వారు అకాడమీలలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈనెల 14, 15 తేదీలలో క్రీడా అకాడమీలలో ప్రవేశం పొందేందుకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు.

వనపర్తిలో హాకీ..
వనపర్తి జిల్లా కేంద్రంలోని హాకీ అకాడమీలో బాలుర హాకీ సీట్లకు ఈనెల 14, 15 తేదీలలో ఎంపికలు ఉంటాయి. వనపర్తి పట్టణంలోని బాలకృష్ణ స్టేడియంలో ఎంపిక చేస్తారు.

ఖమ్మంలో అథ్లెటిక్స్..
ఖమ్మం నగరంలోని అథ్లెటిక్స్ అకాడమీలో అథ్లెటిక్స్ బాలుర విభాగాలలో ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఎంపికలుంటాయి.

హైదరాబాద్ లో..
హైదరాబాద్ నగరంలో సైక్లింగ్, రెజ్లింగ్ అకాడమీ, వెలోడ్రోం క్రీడాకారుల ఎంపికలుంటాయి. ఇదే నెల 14, 15 తేదీలలో క్రీడాకారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు.

16ఏళ్లలోపు వయసుండాలి
పైవిభాగాలలో పాల్గొనే క్రీడాకారుల వయసు 2021 డిసెంబర్ 31నాటికి 16ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలని అధికారులు తెలిపారు.

హన్మకొండలో
హన్మకొండలోని రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్, హ్యాండ్ బాల్ క్రీడల్లో బాలబాలికల సీట్లకు ఎంపికలుంటాయి. ఇదేనెల 14, 15 తేదిలలో హన్మకొండలోని జవహర్ లాల్ స్టేడియంలో క్రీడాకారుల ఎంపిక జరుగుతుంది.

ఆయా విభాగాల్లో పాల్గొనే వారి వయసు 31-12-2021 నాటికి 10 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలని తెలిపారు.

హైదరాబాద్ సరూర్ నగర్ లో..
హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ లోని వాలీబాల్ అకాడమీలో వాలీబాల్ క్రీడా సీట్లకు ఫిబ్రవరి 14వ తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో క్రీడాకారుల ఎంపిక ఉదయం 8 గంటల నుంచి జరుగుతుంది.

ఆయా విభాగంలో పాల్గొనే వారి వయసు 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు (తేదీ: 01-01-2004 నుంచి తేదీ: 01-01-2008 మధ్య జన్మించి ఉండాలి)

ఏఏ సర్టిఫికెట్లు వెంట తెచ్చుకోవాలి

1). వయసు ధ్రువీకరణ పత్రం
2). ప్రస్తుతం చదువుతున్న స్కూల్/కాలేజీ నుంచి స్టడీ సర్టిఫికెట్
3). ఆధార్ కార్డు
4). స్పోర్ట్స్ సర్టిఫికెట్
5). లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజు ఫొటోలు 10