నిరసనలకు తలొగ్గిన బ్రిటన్ ప్రధాని.. రాజీనామా నిర్ణయం

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఎట్టకేలకు రాజీనామా నిర్ణయం ప్రకటించారు. తన మంత్రి వర్గంలోని 54 మంది మంత్రులు రాజీనామా చేయడంతో ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు.

కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బోరిస్ జాన్సన్ 2019 నుంచి బ్రిటన్ ప్రధానిగా కొనసాగుతున్నారు. గత కొన్నాళ్లుగా బోరిస్ జాన్సన్ కు వ్యతిరేకంగా బ్రిటన్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీ సభ్యులే వరుస రాజీనామాలకు తలపడ్డారు.

తాజాగా మంత్రుల రాజీనామాలతో ప్రధాని పదవికి బోరిస్ వైదొలిగేందుకే సిద్ధమయ్యారు. అయితే కొత్త ప్రధాని వచ్చేంత వరకూ బోరిస్ జాన్సన్ ఆ పదవిలో కొనసాగనున్నారు.