విజయవాడలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యభర్తల మృత్యువాత

రచ్చబండ : విద్యుదాఘాతంతో నలుగురు కుటుంబ సభ్యులు మృత్యువాత పడిన దుర్ఘటనను మరువక ముందే ఆంధ్రప్రదేశ్ లో మరో విషాద ఘటన చోటుచేసుకొంది. విజయవాడలోని సత్యనారాయణ పురంలో జరిగిన ఈ ఘటనతో నగరంలో విషాదం చోటుచేసుకొంది.

సత్యనారాయణ పురం భానునగర్ లోని ఓ వ్యక్తి తన ఇంటిలోని విద్యుత్ మోటారును ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ గురయ్యాడు. అతన్ని రక్షించే క్రమంలో ఆయన భార్యకూ విద్యుత్ షాక్ తగిలింది. ఇద్దరూ అదే మోటారుపై పడి ప్రాణాలిడిచారు.

గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అక్కడక్కడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అంతటా ఎక్కడ ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన నెలకొంది.