హుజూర్ నగర్ లో ఎమ్మెల్యే సైదిరెడ్డిపై తరగని అభిమానం

హుజూర్ నగర్ లో ఎమ్మెల్యే సైదిరెడ్డిపై తరగని అభిమానం 

రచ్చబండ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిపై జనంలో అభిమానం చెక్కు చెదరలేదు. కులమత, చిన్న, పెద్ద అన్న తేడా చూపకుండా కలిసి పోయిన సైదిరెడ్డిని గత ఉప ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అప్పటి నుంచి అంతే అభిమానాన్ని చూపుతో జనంలో మమేకమైన శానంపూడి సైదిరెడ్డినే బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో మళ్ళీ జనం ఆదరాభిమానాలు చూపేందుకు సిద్ధమయ్యారు. దీనికి ఈ చిత్రమే నిదర్శనం. అయనపై పూల వర్షం కురిపిస్తూ గ్రామంలోకి ఆహ్వానించడం అయనపై జనానికి ఉన్న అభిమానానికి నిదర్శనం.

వెంకట్రాంపురంలో పంచాయతీ భవనం ప్రారంభించిన శానంపూడి
మేళ్లచెరువు మండలం వెంకట్రాంపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యలయాన్ని ప్రారంభించిన అయనపై గ్రామస్తుల అభిమానం చెక్కు చెదరలేదని నిరూపించారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్నగర్ అభివృద్ధి ప్రదాత అని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కొనియాడారు. గ్రామంలోకి రాక ముందే గ్రామస్తులు ఎదురేగి తిలకం దిద్ది, హారతి ఇచ్చి, పూల వర్షంలో హర్షాతిరేకాలు నడుమ గ్రామంలోకి ఎమ్మెల్యే శానంపూడిని ఆహ్వానించారు.