ప్రొద్దుటూరులో వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

ప్రొద్దుటూరులో వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
రచ్చబండ, శంకర్ పల్లి: శ్రీ షిరిడిసాయి సేవదళ్ ఆధ్వర్యంలో మహాలయ పక్షం సందర్భంగా సాయి కుటుంబ సభ్యులు ఈమని శ్రీనివాస్ కల్పన దేవి, కాజా రామకృష్ణ క్రాంతి ఆర్ధిక సహకారంతో మంగళవారం శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయి సేవదల్ వ్యవస్థాపకులు కల్ల రత్నాజీ, సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ మాట్లాడారు.

తల్లిదండ్రులను కోల్పోయి వాల్మీకి ఫౌండేషన్లో ఉంటున్న విద్యార్థులకు శ్రీ షిరిడి సాయి సేవదల్ ఎప్పుడు అండగా ఉంటుందని, పిల్లలు పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకున్నప్పుడే చదువు పట్ల ఏకాగ్రతతో ఉండి చదివే అంశాల పైన శ్రద్ధ వహిస్తారని, పక్షంలో రెండు సార్లు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవ వేడుకల శుభ సందర్భంగా ఫౌండేషన్లో ప్రత్యేక వంటకాలు, పిల్లలకు భోజనం పెట్టి తల్లిదండ్రులు లేరనే భావనను దూరం చేయడానికి శ్రీ షిరిడి సాయి సేవదల్ ఎల్లప్పుడు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, ఉమామహేశ్వర్, ఫౌండేషన్ సభ్యులు నాయుడు, చిన్న, విద్యార్థులు పాల్గొన్నారు.