నెరవేరనున్న జనవాడ, మిర్జాగూడ గ్రామాల ప్రజల చిరకాల కోరిక

నెరవేరనున్న జనవాడ, మిర్జాగూడ గ్రామాల ప్రజల చిరకాల కోరిక
* రూ.7 కోట్లతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలు
* 9 ఏండ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి పథంలో పల్లెలు
* రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి: జనవాడ, మిర్జాగూడ గ్రామాలకు సిసి, బీటీ రోడ్ల నిర్మాణాలతో ఆయా గ్రామాల ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరునున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జనవాడ, మిర్జాగూడ గ్రామాలకు హెచ్ఎండిఏ నిధులు, రూ. 527 కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు 9 సంవత్సరాల తన పాలనలో రాష్ట్రంలోని గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. వృద్ధులకు వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు ఇస్తూ వారి ఆదుకుంటున్నారని తెలిపారు.

రైతులకు,రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టి వారి కష్టాల్లో పాలుపంచుకుంటున్నారని చెప్పారు. కులవృత్తి వారికి రూ. లక్ష త్వరలోనే అందిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే క కాలే యాదయ్య, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి ఏఎంసి చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్ ,పిఎసిఎస్ శశిధర్ రెడ్డి, మండల, మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా పాల్గొన్నారు.

ఇంకా ఆయా గ్రామాల సర్పంచులు గౌడ్ చర్ల లలిత నరసింహ, రవీందర్ గౌడ్, ఎంపీడీవో వెంకయ్య, డిప్యూటీ తాసిల్దార్ ప్రియాంక, ఎంపీ ఓ గీత, ఏపీవో నాగభూషణం , నాయకులు ప్రవీణ్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, పార్శి బాలకృష్ణ, కిషన్ సింగ్, పిఎసిఎస్ డైరెక్టర్ అంజయ్య, ఆయా గ్రామాల వార్డు సభ్యులు, కార్యకర్తలు , గ్రామస్తులు పాల్గొన్నారు.