నిరుడి గణేష్ లడ్డూ వేలం సొమ్ము రూ.7.01 లక్షల అందజేత

నిరుడి గణేష్ లడ్డూ వేలం సొమ్ము రూ.7.01 లక్షల అందజేత

* నిర్వాహకులకు అందజేసిన కాడిగారి రాజశేఖర్ రెడ్డి తల్లిదండ్రులు

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామంలో శ్రీ వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గత సంవత్సరం వినాయక చవితి పండుగ ఉత్సవాల్లో జరిగిన వేలంలో లడ్డూ పాడిన శంకర్ పల్లి పీఏసీఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి వేలం సొమ్మును మంగళవారం అందజేశారు. రూ.7.01,000 నగదును రాజశేఖర్ రెడ్డి తల్లిదండ్రులు జయమ్మ, సత్యనారాయణరెడ్డి దంపతులు ఇచ్చారు. లడ్డూ ప్రసాదము వేలం పడిన డబ్బును మలి వినాయక చవితి పండుగకు ముందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్బంగా వినాయక మంటప నిర్వాహకులు దంపతులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు మధుకర్ రెడ్డి, భరత్ రెడ్డి, రంజిత్ రెడ్డి, జీవన్ రెడ్డి, మణికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.