దాతలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం

దాతలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం
* జిల్లా డిప్యూటీ డీహెచ్ఎంఓ డాక్టర్ దామోదర్

రచ్చబండ, శంకర్ పల్లి: దాతలు ముందుకు వచ్చి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ దామోదర్ అన్నారు. శనివారం శంకర్ పల్లి మండలంలోని శేరిగూడ గ్రామంలో ఇండస్ ఇంటర్నేషనల్ పాఠశాల వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ వైద్య శిబిరానికి హాజరై వైద్యాధికారి మాట్లాడుతూ పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎం. సత్యనారాయణ, ఇంద్రసేనారెడ్డి, డాక్టర్లు వైద్య సిబ్బంది, ఇండస్ స్కూల్ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.