*జూలపల్లి గ్రామంలో సాయి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ*
రచ్చబండ, ఆమనగల్లు
(తలకొండపల్లి):
రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండల పరిధిలోని జూలపల్లి గ్రామంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ధర్మ రక్షకుడైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవీష్కరించారు. విగ్రహ ధాత జూలపల్లి గ్రామ వాస్తవ్యులు నా రెడ్డి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వారి మనవడు సాయి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి జూలపల్లి గ్రామ సర్పంచ్, పాలకమండలి, ఫ్రెండ్స్ యూత్, యువసేన యూత్ చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్లు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవష్కరణకు విచ్చేసినటువంటి రాజకీయ నాయకులకు, వివిధ గ్రామాల ప్రజలకు, యువకులకు ధన్యవాదాలు తెలిపారు.