ఎమ్మార్పీఎస్ శంకర్ పల్లి మండల నూతన కార్యవర్గం

ఎమ్మార్పీఎస్ శంకర్ పల్లి మండల
నూతన కార్యవర్గం

రచ్చబండ, శంకర్ పల్లి : మండల కేంద్రంలోని గెస్ట్ హౌస్ లో గురువారం శంకర్ పల్లి మండల ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు క్యాసారం శంకర్ రావు మాదిగ హాజరయ్యారు.

మండల అధ్యక్షులుగా శ్రీనివాస్ ఉపాధ్యక్షులు జోగు దశరత్ వెలిమెల నవీన్, ప్రధాన కార్యదర్శి అండూరి ప్రశాంత్, అధికార ప్రతినిధి
దేశ్ పండే శ్రీనివాస్ కార్యదర్శి ఉత్తరపల్లి భారత్, లింగంపల్లి పరుశురాం,
సోషల్ మీడియా కన్వీనర్ చిట్టికే ఈశ్వర్ కోశాధికారి తొంట నర్సింలు ప్రచార కమిటీ నక్క వెంకటేష్, బొండ ప్రశాంత్,
మాదిగ యువసేన మండల కన్వీనర్ డప్పు గిరిబాబు ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివ శంకర్ ఎం ఎస్ ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాని భానుప్రసాద్ మండల సీనియర్ నాయకులు లక్ష్మయ్య, నర్సింలు, ప్రవీణ్, శివ,రాములు,రాజు ఎం ఎస్ ఎఫ్ నాయకులు యాదగిరి, వినయ్ తదితరులు పాల్గొన్నారు‌.