ఈటల ఆత్మగౌరవానికి ప్రతీక

ఎంఈపీఏ రాష్ట్ర కార్యవర్గం

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆత్మగౌరవానికి ప్రతీక అని ఎంఈపీఏ (ముదిరాజ్ ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ) రాష్ట్ర కార్యవర్గం  శనివారం నాడొక ప్రకటనలో పేర్కొన్నది. ఆయన మొదటి నుంచి బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని తెలిపారు. భావిసమాజానికి ఉద్యమదీప్తి, అలుపెరుగని తెలంగాణ పోరాటాయోధుడైన   ఈటెల రాజేందర్ పై కుట్రపూరిట ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఆయనపై వచ్చిన భూ కబ్జాల ఆరోపణలను ఆ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు  అవాస్తవని పేర్కొన్నారు. బడుగుల నేత ఈటలకు ముదిరాజ్ కుల బంధువులు, ఇతర సామాజిక వర్గాలు బాసటగా నిలవాలని నేతలు కోరారు.